: తెలంగాణతో గొడవ పడేందుకు సిద్ధంగా లేను: చంద్రబాబునాయుడు
తెలంగాణతో గొడవ పడేందుకు తాను సిద్ధంగా లేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నానని అన్నారు. సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా సార్లు చెప్పానని ఆయన గుర్తుచేశారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే కేంద్రంలోని పెద్దల వద్ద పరిష్కారానికి కూర్చుందామన్న ప్రతిపాదనకు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. 'హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని' అని విభజన చట్టం స్పష్టంగా చెబుతున్నప్పటికీ అంతకాలం అక్కడ ఉండాలన్న ఆలోచన తనకు లేదని ఆయన అన్నారు. అందుకే రెండేళ్లలో హైదరాబాదు నుంచి అమరావతి వచ్చేశానని ఆయన తెలిపారు.