: నేను పిలవకపోయినా క్లింటన్ వచ్చారు... క్లింటన్ చెప్పారని టోనీ బ్లెయిర్ వచ్చారు: చంద్రబాబునాయుడు


గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనకు వచ్చినప్పటి సంఘటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయన షెడ్యూల్ లో దేశాధ్యక్షుడు, ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేతలతో మాత్రమే సమావేశాలు ఉన్నాయని, ఆయనను కలవాలని ఉందని అంబాసిడర్ ను అపాయింట్ మెంట్ అడిగితే ఆయన ఇవ్వలేదని చంద్రబాబు తెలిపారు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి తాను వస్తున్నట్టుగా క్లింటన్ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని చెప్పారు. ఆయన ఏపీకి వచ్చిన సందర్భంగా మొదటి ప్రశ్నగా ఆయనను... 'మీరు వస్తారో రారోనన్న అనుమానంతో నేను పిలవలేదు కదా, అయినా మీరెలా వచ్చార'ని అడిగానని అన్నారు. దానికి ఆయన అమెరికాలోని పలు ప్రధాన పత్రికల్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూశానని, అప్పుడే ఈ ప్రాంతాన్ని పరిశీలించాలని భావించానని, అందుకే వచ్చానని ఆయన సమాధానమిచ్చారని చంద్రబాబు తెలిపారు. ఆ తరువాత బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా ఏపీకి వచ్చారని, ఆయనను కూడా తాను అదే ప్రశ్న అడిగానని అన్నారు. దానికి ఆయన సమాధానమిస్తూ, 'ఇండియాలో దట్ ఈజ్ మోస్ట్ హేపెనింగ్ ప్లేస్, యూ షుడ్ సీ' అని బిల్ క్లింటన్ తనకు చెప్పారని, అందుకే ఏపీకి వచ్చానని తనతో అన్నారని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News