: కూకట్ పల్లిలో పానీపూరి అమ్మిన హీరో మంచు విష్ణు!


హైదరాబాద్, కూకట్ పల్లిలో హీరో మంచు విష్ణు పానీపూరి అమ్మాడు. ఫ్యాంటు, బనియన్ ధరించి ఎర్ర టవల్ ఒకటి మెడలో వేసుకుని కళ్లద్దాలు ధరించిన విష్ణు వద్ద పానీపూరి కొనుక్కుని తినేందుకు బారులు తీరారు. అసలు, విష్ణు పానీ పూరి ఎందుకమ్మాల్సి వచ్చిందంటే... తన సోదరి మంచు లక్ష్మి ప్రసన్న నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం కోసం తన వంతు ఆర్థికసాయం చేసేందుకు ఈ అవతారమెత్తాల్సి వచ్చింది. మేము సైతం ద్వారా వచ్చే డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, రవితేజ, రానా, నాని, అఖిల్ అక్కినేని, హీరోయిన్లు శ్రియ, రకుల్ ప్రీతి సింగ్, రెజీనా, యాంకర్ సుమ తదితరులు ‘మేము సైతం’ కోసం తమ వంతు పాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News