: ముంబైలో ఎయిరిండియా విమానానికి స్వల్ప ప్రమాదం
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. ఇక్కడి నుంచి ప్రయాణికులతో సౌదీ అరేబియాలోని రియాద్ కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ కు సిధ్ధమవుతుండగా ఎయిరో బ్రిడ్జ్ ని ఢీ కొట్టింది. దీంతో విమానం ఎడమవైపు రెక్క రోటర్ బ్లేడ్ దెబ్బతింది. దీంతో టేకాఫ్ ను నిలిపివేశారు. ప్రమాద తీవ్రత, నష్టం, ప్రయాణికుల తరలింపు తదితర వివరాలపై మరింత సమాచారం అందాల్సిఉంది.