: విజయవాడ చేరుకున్న చంద్రబాబునాయుడు...ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ చేరుకున్నారు. ఐదు రోజుల చైనా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి, రాష్ట్రానికి అందాల్సిన సాయం, విభజన చట్టంలో పేర్కొన్న కేటాయింపుల గురించి చర్చించారు. అనంతరం విజయవాడ చేరుకున్న ఆయనకు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి, దుశ్శాలువతో సత్కరించారు. పలువురు పార్టీ నేతలు ఆయన కాళ్లకు నమస్కరించి విధేయతను ప్రదర్శించారు.