: ఆస్తుల అటాచ్ పై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలి: దేవినేని
ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఒక్కొక్కరుగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఈరోజు విజయవాడలో స్పందిస్తూ.. ఆస్తుల అటాచ్‌పై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ దోచేసుకున్నారని ఆయన అన్నారు. అవన్నీ బట్టబయలవుతున్నాయని పేర్కొన్నారు. తాము పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఏపీ నూతన రాజధానికి తరలిస్తుంటే దానిపై జగన్ మీడియాలో అసత్య కథనాలు వస్తున్నాయని ఆయన అన్నారు. హైకోర్టు విభజన అంశంపై ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఏర్పాటు చేయడానికి తమకి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. దాని కోసం కేంద్ర నుంచి నిధులు రావాలని పేర్కొన్నారు.