: అధిక ఫీజులను నిరసిస్తూ కడియం శ్రీహరి ఇంటి ముట్టడికి యత్నం... ఉద్రిక్తత
ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లో ఈరోజు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటిని విద్యార్థి, ప్రజా సంఘాలు ముట్టడించే ప్రయత్నం చేశాయి. కడియం ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. విద్యాహక్కు చట్టం అమలు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి ఘోరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని వాపోయారు.