: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గత నాలుగు రోజుల మాదిరిగానే ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 145.91 పాయింట్లు లాభపడి 27144.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 40.60 పాయింట్లు లాభపడి 8328.35 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 67.40 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టి, ఐటీసీ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. నష్టపోయిన వాటిలో టీసీఎస్, కోటక్ బ్యాంక్, జీ ఎంటర్ టైన్ మెంట్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ సంస్థల షేర్లు ఉన్నాయి.