: భాయ్, భాయ్ ఆన్ బైక్ బైక్!: సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్న షారూఖ్, సల్మాన్ ల ఫోటో


బాలీవుడ్ హీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ముంబై రోడ్లపై సందడి చేశారు. పట్టపగలు ముంబై రోడ్ల మీద వీరిద్దరూ కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే అర్ధరాత్రి సమయంలో వీరిద్దరూ రెండు సైకిళ్లు తీసుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీరిలా రోడ్డెక్కగానే మీడియా ప్రతినిధులకు విషయం తెలిసిపోవడంతో, ఆగమేఘాలపై వచ్చేసి, వీరిని కెమెరాల్లో బంధించారు కూడా. కాగా, ఇదే విషయాన్ని షారుఖ్ ట్విట్టర్ లో పేర్కొంటూ 'భాయ్ భాయ్ ఆన్ బైక్ బైక్... నో పొల్యూషన్' అంటూ పోస్టు పెట్టాడు. అలాగే, తమ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఇది వారి అభిమానులను ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోలైన వీరిద్దరూ గతంలో మంచి స్నేహితులు, విభేదాల కారణంగా సుదీర్ఘ కాలం దూరంగా ఉన్నారు. రెండేళ్ల కిందట ఈద్ సందర్భంగా కలుసుకున్న వీరిద్దరూ పలు సందర్భాల్లో ఇలా అభిమానులను ఖుషీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News