: పురుషాధిక్యం, అవినీతి రాజకీయాలకు బలయ్యాను: మహిళా కమిషన్ ముందు అనుపమ షణై ఆవేదన


పురుషాధిక్య వ్యవస్థ, అవినీతి రాజకీయాలకు తాను బలయ్యానని కర్ణాటక మాజీ డీఎస్పీ అనుపమ షణై తెలిపారు. కర్ణాటక మహిళా కమిషన్ సభ్యుల ముందు తన వాదనలు వినిపించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, బళ్లారి ఎస్పీ చేతన రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పని చేయాలంటూ వేధింపులకు గురి చేసేవారని అన్నారు. పురుషాధిక్య సమాజంలో అవినీతి రాజకీయాలకు మహిళా ఉద్యోగులు వేధింపుల బారిన పడకుండా తాను పోరాటం చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగంలో ఉండగా లేని మనశ్శాంతి, ఈ సమయంలో వస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే విధుల్లో ఉండగా వేధింపులకు గురైన వైనాన్ని ఆమె మహిళా కమిషన్ ముందు ఏకరువుపెట్టారు. ప్రాధమిక విచారణ అనంతరం తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్టు మహిళా కమిషన్ సభ్యులు తెలిపారు. కాగా, కుడ్లిగి డీఎస్పీగా పని చేసిన అనుపమ షణై మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఆమె విసిరిన సవాళ్లతో ఆయన మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నారు.

  • Loading...

More Telugu News