: నవ్వుతూ తనువు చాలించిన క్రైస్తవ సన్యాసిని


అర్జెంటీనాకు కు చెందిన క్రైస్తవ సన్యాసిని సిస్టర్ సిసిలియా మారియా (42) నవ్వుతూ తనువు చాలించింది. థెరిసా అండ్ జోసెఫ్ మాంటిస్సోరిలో ఆమె జీవనం సాగిస్తోంది. కొంత కాలంగా నాలుక కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న సిసిలియా ఆసుపత్రి మంచంపై నవ్వుతూ కన్నుమూసింది. తనకు నిర్వహించే అంత్యక్రియలు ఏ విధంగా ఉండాలనే తన చివరి కోరికను ఒక కాగితంపై ఆమె రాసుకుంది. అంత్యక్రియల్లో భాగంగా మొదట ప్రార్థించాలని, అందరికీ గుర్తుండిపోయేలా ఈ కార్యక్రమం నిర్వహించాలనేది తన చివరి కోరిక అని పేర్కొంది. సిసిలియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత నర్సుగా కొన్నాళ్లు పనిచేసింది. కాగా, ఆమె నవ్వుతూ మృతి చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News