: సీఎంల మ‌ధ్య ఒప్పందం జరిగింది.. అందుకే హైకోర్టు విభ‌జ‌న జరగలేదు: పొన్నం ప్ర‌భాక‌ర్‌ ఆరోపణ


తెలంగాణ‌లో న్యాయ‌వాదులు పెద్ద ఎత్తున ఆందోళ‌నకు దిగిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ మ‌రోసారి స్పందించారు. ఈరోజు మెద‌క్ జిల్లాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌, చంద్ర‌బాబుల మ‌ధ్య చీక‌టి ఒప్పందం జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. అందుకే హైకోర్టు విభ‌జ‌న జ‌ర‌గ‌డం లేద‌ని ఆయ‌న ఆన్నారు. కేసీఆర్ ఢిల్లీలో ధ‌ర్నాకు దిగుతాన‌ని అంటున్నార‌ని, ధ‌ర్నా చేయ‌డం కాకుండా చంద్ర‌బాబుతో మాట్లాడాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఏపీ సీఎంతో కేసీఆర్ మాట్లాడి న్యాయ‌వాదుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ స్వార్థంతో ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, అందుకే న్యాయ‌వాదులు రోడ్డెక్కి నిర‌స‌న తెలిపే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News