: ప్రత్యేక జిల్లా కోసం ఆందోళన.. జనగామలో తీవ్ర ఉద్రిక్తత.. పలు వాహనాలు ధ్వంసం
వరంగల్ జిల్లా జనగామలో ప్రత్యేక జిల్లా కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన కారులు రెచ్చిపోయారు. రోడ్డుపై కనపడిన పోలీసు, ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళన కారుల దాడితో మొత్తం 20 వాహనాలు ధ్వంసమయినట్లు సమాచారం. అక్కడి జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధం చేశారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనతో అక్కడి ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.