: సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్లను నమ్మొద్దు: మరోసారి విజ్ఞప్తి చేసిన హైదరాబాద్ సీపీ
సోషల్ మీడియాలో హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై పలు రూమర్లు విస్తరిస్తున్నాయని, వాటిని నమ్మొద్దని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు పాతబస్తీలో పోలీసు బందోబస్తుని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు పాతబస్తీలో ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పార్థనల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చెలరేగకుండా బందోబస్తు చేశామని అన్నారు. హైదరాబాద్ అంతటా పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.