: టీమిండియా కోచ్ గా కుంబ్లే ఎంపిక ఎఫెక్ట్!... ఐసీసీ కమిటీకి రవిశాస్త్రి రాజీనామా!
టీమిండియా హెడ్ కోచ్ గా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఎంపికతో అప్పటిదాకా ఆ పదవిపై గంపెడాశలు పెట్టుకున్న జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి షాక్ తిన్నారు. ఆ తర్వాత కోచ్ ఎంపిక కోసం సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూలపై శాస్త్రి ఘాటు కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలకు గంగూలీ కూడా ఘాటుగానే బదులిచ్చారు. తాజాగా రవిశాస్త్రి ఓ కీలక పదవిని వదులుకోక తప్పలేదు. ఐసీసీలో కుంబ్లే చైర్మన్ గా ఓ కమిటీ పనిచేస్తోంది. సదరు కమిటీలో రవిశాస్త్రి కూడా సభ్యుడిగా ఉన్నారు. మీడియా ప్రతినిధి హోదాలో సదరు కమిటీలో సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి... ఆ కమిటీ చైర్మన్ గా ఉన్న కుంబ్లే టీమిండియా కోచ్ గా ఎంపిక కావడంతో సదరు సభ్యత్వానికి రాజీనామా చేశారు.