: మలేషియాలో బిజీబిజీగా తెలంగాణ మంత్రి కేటీఆర్
తెలంగాణకు పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా మలేషియాలో పర్యటిస్తోన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ అక్కడి ప్రభుత్వాధికారులతో చర్చిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు మలేషియా ప్రధాని సలహాదారు ఇడ్రిస్ జలతో కేటీఆర్ సమావేశమయ్యారు. మలేషియా ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తోన్న పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ యూనిట్ పనితీరును తెలుసుకున్నారు. 2020 నాటికి మలేషియాను ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ యూనిట్ పనిచేస్తోందని కేటీఆర్‌కు ఇడ్రిస్ జల వివరించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఈరోజు మరికొంతమంది మలేషియా ప్రభుత్వ అధికారులతో భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరించనున్నట్లు సమాచారం.