: బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులు.. పూజారి దారుణహత్య
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. అక్కడి మైనారిటీలపై దాడులకు తెగబడుతున్న ముష్కరులు తాజాగా ఈ ఉదయం ఓ హిందూ పూజారిని దారుణంగా హత్య చేశారు. జినైదా జిల్లా కేంద్రంలోని ఓ ఆలయంలో షాయ్‌మనోనందా దాస్(45) అనే పూజారి ఈ తెల్లావారుజామున పూజలు చేసేందుకు ఉపక్రమిస్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు అతడిని హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కాగా గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ఘటనలకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించగా ప్రభుత్వం వాటిని కొట్టిపారేసింది. స్థానికంగా పురుడు పోసుకుంటున్న ఉగ్రవాదుల హస్తం ఇందులో ఉండొచ్చని పేర్కొంది.