: రంజాన్ మాసంలో నేడు చివరి శుక్రవారం!... పాతబస్తీలో 2 వేల మంది సాయుధ బలగాలు!


ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెలలో నేడు చివరి శుక్రవారం. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని చారిత్రక కట్టడం చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో తిష్ట వేసిన ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున దాడులకు వ్యూహ రచన చేసిన ఉగ్రవాదుల పన్నాగాలను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో నేడు మక్కా మసీదులో జరగనున్న ప్రార్థనల సందర్భంగా కల్లోలం రేగుతుందా? అన్న అనుమానాలు రేకెత్తాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 2 వేల మంది సాయుధ బలగాలను పోలీసు బాసులు రంగంలోకి దించారు. పెద్ద సంఖ్యలో పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రత్యక్షంగా భద్రతా విధుల్లోకి దిగారు. దీంతో ఒక్క పాతబస్తీలోనే కాకుండా యావత్తు నగరవ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News