: ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుమార్తె.. తట్టుకోలేక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లి!


తను తెచ్చిన సంబంధాన్ని కాదని ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తెను చూసిన ఓ తల్లి గుండె ముక్కలైంది. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కేరళలోని వెల్లార్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పూన్‌కుళం సమీపంలోని వయలింకర వీడులో నివసిస్తున్న సునీత(37)కు కార్తీక(19) అనే కుమార్తె ఉంది. ఆమెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఓ ఆర్మీ ఉద్యోగి సంబంధం తీసుకొచ్చారు. అప్పటికే మరో యువకుడిని ప్రేమిస్తున్న కార్తీక అదే విషయాన్ని ఆర్మీ ఉద్యోగికి చెప్పింది. దీంతో ఆయన ఆ సంబంధాన్ని వద్దనుకున్నాడు. తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్న విషయం యువతి తన ప్రియుడికి చెప్పడంతో ఇద్దరూ కలిసి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రేమికులిద్దరూ పారిపోతున్న సమయంలో కుటుంబ సభ్యులు పట్టుకోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు యువతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించారు. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో ఇంటికి సమీపంలోని ఓ ఆలయంలో ప్రేమికులిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి కొందరు కుటుంబ సభ్యులు పెళ్లికి హాజరయ్యారు. అయితే యువతి తీరుతో తీవ్ర మనస్తాపంతో ఉన్న తల్లి సునీత సరిగ్గా పెళ్లి జరగనున్న 8.30 గంటల ప్రాంతంలో ఇంటిలో శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పెళ్లి అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు 90శాతం గాయాలతో కాలి పడి ఉన్న సునీతను గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News