: బాబ్లీ గేట్లు తెరచుకుంటున్నాయి!... అక్టోబర్ 28 దాకా నీటి విడుదల!


తెలంగాణ, మహారాష్ట్ర మధ్య గోదావరి నదిపై ఉన్న కీలక ప్రాజెక్టు బాబ్లీ గేట్లు నేడు తెరచుకోనున్నాయి. మహారాష్ట్ర నీటిని బిగబట్టి, తెలుగు రాష్ట్రాల నీటి వాటాను కొల్లగొట్టేందుకు మహారాష్ట్ర నిర్మించిందని భావిస్తున్న ఈ ప్రాజెక్టుపై గతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఈ ప్రాజెక్టు విషయంలో విభేదాలు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ఠ్రాల నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారుల సమక్షంలో నేడు బాబ్లీ ప్రాజెక్టులోని 14 గేట్లు తెరచుకోనున్నాయి. అక్టోబర్ 28 దాకా ఓపెన్ గానే ఉండే ఈ గేట్ల నుంచి తెలంగాణ, అటు నుంచి ఏపీకి నీరు నిరంతరాయంగా విడుదల కానుంది.

  • Loading...

More Telugu News