: జులైలో పది రోజులు మూతపడనున్న బ్యాంకులు.. వినియోగదారులకు కష్టకాలం
ఈ నెలలో బ్యాంకులు పదిరోజులు మూతపడనున్నాయి. జులైలో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు, రంజాన్ పండుగ, రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో కలుపుకుని మొత్తంగా పదిరోజులు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. కాబట్టి వినియోగదారులకు కొంత అసౌకర్యం తప్పేట్టు కనిపించడం లేదు. అయితే ఈ నెలలో ఎనిమిది రోజులు సాధారణ సెలవు దినాలే కాబట్టి బ్యాంకు లావాదేవీలపై ప్రభావం చూపే అవకాశం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఏటీఎంల విషయంలోనూ వినియోగదారులకు అసౌకర్యం కలగదని చెబుతున్నారు. బ్యాంకులకు నేరుగా వెళ్లి డబ్బులు డ్రా చేయడంతోపాటు ఇతర లావాదేవీలు నిర్వహించే వారిపై సెలవుల ప్రభావం కొంత వరకు ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. కాగా వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ఉద్యోగ సంఘాలు రెండు రోజుల సమ్మె తలపెట్టాయి. ఇప్పటికే సమ్మె నోటీసులను ప్రభుత్వానికి అందజేశాయి.