: స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు!... నిన్న రాత్రి నుంచే అమల్లోకి కొత్త ధరలు!
వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈసారి కాస్తంత తగ్గాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్ క్రూడాయిల్ ధరల్లో చోటుచేసుకున్న మార్పుల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గిస్తున్నట్లు నిన్న ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ పై 89 పైసలు, లీటర్ డీజిల్ పై 49 పైసల మేర ధరలను తగ్గిస్తూ ఆ సంస్థలు ప్రకటించాయి. ఈ ధరలు నిన్న అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. మే 1 నుంచి పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు రెండు నెలల తర్వాత స్వల్పంగా మాత్రమే తగ్గడం గమనార్హం.