: సొంతూరు చేరిన నారా లోకేశ్!... మరికాసేపట్లో కార్యకర్తలతో భేటీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న రాత్రికే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా అక్కడకు వెళ్లిన లోకేశ్... మరికాసేపట్లో అక్కడికి సమీపంలోని రామచంద్రాపురంలో కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీకి చంద్రగిరి నియోజకవర్గంలోని పార్టీ యువ నేతలంతా హాజరవుతున్నారు. ఇక ఈ సమావేశం తర్వాత తిరుపతిలో జరుగుతున్న పార్టీ శిక్షణా తరగతులకు కూడా లోకేశ్ హాజరుకానున్నారు.