: వాద్రాను ఇరుకున పెట్టేందుకు జస్టిస్ ధింగ్రాకు బీజేపీ లంచం ఇస్తోంది: కాంగ్రెస్


కాంగ్రెస్‌ను ఎలాగైనా ఇరుకున పెట్టాలని భావిస్తున్న బీజేపీ ప్రభుత్వం సోనియాగాంధీ అల్లుడి భూముల వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ధింగ్రాకు లంచం ఇస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. గుర్‌గావ్ భూముల కుంభకోణంలో దర్యాప్తునకు ప్రభుత్వం రిటైర్ట్ జడ్జి ఎస్ఎన్ ధింగ్రా ఆధ్వర్యంలో ఓ ప్యానెల్ ఏర్పాటు చేసింది. వాద్రాను ఎలాగైనా దోషిగా తేల్చాలని భావిస్తున్న ప్రభుత్వం ధింగ్రాను వివిధ రూపాల్లో లొంగదీసుకుంటోందని హర్యానా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అజయ్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. గుర్‌గావ్‌లోని ఓ గ్రామంలో ధింగ్రా ముఖ్యుడుగా ఉన్న ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూలుకు ప్రభుత్వం రోడ్డు వేసేందుకు అనుమతించడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే గురువారంతో ప్యానెల్ గడువు ముగియనుండగా మరో ఆరు నెలలు పొడిగించాలని భావించడం కూడా ఇందుకు ఊతమిస్తోందన్నారు. గురువారం తాను కొన్ని డాక్యుమెంట్లు అందుకున్నానని, వాటిని కూలంకషంగా పరిశీలించాల్సి ఉందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ధింగ్రా లేఖ రాసిన నేపథ్యంలో ప్యానల్ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విశ్వాసాన్ని కోల్పోయిన ప్యానెల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని అజయ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News