: మోదీపై వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ప్రశంసలు!.. భారత ప్రధానికి వీరాభిమానినని కిమ్ ప్రకటన!


ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తనదైన శైలిలో సత్తా చాటుతున్నారు. ప్రధాని పీఠమెక్కిన మరుక్షణమే పలు కొత్త పథకాలను ప్రకటించిన మోదీ... వాటిని నిరాఘాటంగా ముందుకు తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఫలితాలు రాబడుతున్నారు. రిజల్ట్ ఓరియెంటేషన్ తో ముందుకు సాగుతున్న ప్రధాని మోదీ పనితీరుపై విశ్వవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు చైర్మన్ జిమ్ యాంగ్ కిమ్ ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ప్రశంసించడమే కాదండోయ్... మోదీ పనితీరుకు కిమ్ అచ్చెరువొందారు. తాను మోదీకి వీరాభిమానిని అంటూ ఆయన నిన్న ఓ కీలక ప్రకటన చేశారు. భారత పర్యటనకు వచ్చిన కిమ్ నిన్న మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ‘‘గొప్ప గొప్ప నాయకులు చేయాలనుకున్న పనిని మోదీ చేశారు. ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా కాలపరిమితి (డెడ్ లైన్) నిర్ణయించుకున్నారు. వాటికి ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిని బాధ్యులను చేస్తున్నారు. మంచి ఫలితాలను రాబట్టాలంటే అలాగే చేయాలి. అవన్నీ ఆయన చేస్తున్నారు కాబట్టే నేను మోదీకి వీరాభిమానినయ్యాను’’ అంటూ కిమ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News