: భానుకిరణ్ ను మేము భరించలేము... చంచల్ గూడకు తరలించండి: చర్లపల్లి జైలు అధికారుల వేడికోలు
భాను కిరణ్ ను భరించడం తమ వల్ల కాదని చర్లపల్లి జైలు అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్ అప్పటి నుంచి జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా కోహ్లీ గ్యాంగ్ పోలీసులకు పట్టుబడడంతో, అతని వెనుక భాను కిరణ్ ఉన్నాడని, జైలు నుంచే దందాలకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు అతనిని చర్లపల్లి జైలు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చర్లపల్లి జైల్లో భద్రతా సమస్యలున్నాయని, వీలైనంత తొందరగా అతనిని తరలించాలని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.