: రజనీకాంత్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పుదుచ్చేరి కలెక్టర్


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు పుదుచ్చేరి కలెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ లాంటి ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ టికెట్లు కానుకగా ఇస్తామంటూ చేసిన ప్రకటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఈ సందర్భంగా రజనీకి కిరణ్ బేడీ ఒక విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరికి రజనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని ఆ ట్వీట్ లో ఆమె కోరారు.

  • Loading...

More Telugu News