: విలువైన 'పాత్ర' పేరుతో వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించిన ఢిల్లీ గ్యాంగ్ అరెస్ట్


ఇరీడియం పాత్ర పేరుతో హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దామోదరరెడ్డి సహా పలువురిని మోసం చేసిన కోహ్లీ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. తమ వద్ద ఇరీడియం పాత్ర ఉందని, పిడుగు పడుతున్నప్పుడు అందులోంచి దానిని తీశామని, దీని చదరపు అంగుళం విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3500 కోట్లు ఉంటుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్తలను కోట్లాది రూపాయలకు బురిడీ కొట్టించిన ఢిల్లీకి చెందిన కోహ్లీ గ్యాంగ్ ను పోలీసులు పట్టేశారు. ఈ సందర్భంగా వారి నుంచి 1.45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్.ఎస్. కోహ్లీతోపాటు భాను కిరణ్ అనుచరుడు గంగాధర్ రెడ్డి, రమేష్ బాబులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News