: అతని వీడ్కోలు మ్యాచే నా తొలి మ్యాచ్: మురళీ విజయ్
టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేతో తన అనుబంధాన్ని ఆటగాడు మురళీ విజయ్ గుర్తుచేసుకున్నాడు. కాకతాళీయంగా కుంబ్లే క్రికెట్ నుంచి వైదొలగిన చివరి మ్యాచ్ లోనే తాను అరంగేట్రం చేశానని అన్నాడు. తాను కుంబ్లేకు పెద్ద అభిమానినని మురళీ విజయ్ తెలిపాడు. కుంబ్లేను యువకుడిగా ఉన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నానని అన్నాడు. ఆయన నుంచి యువ క్రికెటర్లు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పాడు. కుంబ్లే టీమిండియా కోచ్ గా ఎంపిక కావడం జట్టుకు లాభదాయకమని మురళీ విజయ్ తెలిపాడు.