: సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మకండి: హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి


హైదారాబాద్ లో ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సూచించారు. నగరంలోని పలుచోట్ల బాంబులు అమర్చారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. కాగా, నిన్న అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులను ఈరోజు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా వారికి రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News