: నైజీరియాలో విశాఖ వాసి సహా ఇద్దరు ఇంజనీర్లు కిడ్నాప్!
నైజీరియాలో ఇద్దరు భారతీయ ఇంజనీర్లు కిడ్నాప్ నకు గురయ్యారు. కిడ్నాపైన వారిలో ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన ఇంజనీర్ సాయిశ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా జిబోకోలోని డంకోట సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంజనీర్ గా ఆయన పనిచేస్తున్నారు. కిడ్నాప్ సమాచారంతో సాయిశ్రీనివాస్ భార్య లలిత, కూతురు స్ఫూర్తి కన్నీటి పర్యంతమవుతున్నారు.