: అంతగా గౌరవిస్తే ముందుగా ఐదు నక్షత్రాల హోటళ్లలో బీఫ్ ను నిషేధించాలి!: మోదీకి అజాం ఖాన్ సవాల్
ప్రధాని నరేంద్ర మోదీని యూపీ మంత్రి అజాం ఖాన్ మళ్లీ విమర్శించారు. ప్రధానికి నిజంగా గోమాతపై అంతగా గౌరవం ఉంటే ఐదు నక్షత్రాల హోటళ్లలో బీఫ్ ఆహారాన్ని నిషేధించాలని సవాలు విసిరారు. ఝాన్సీలో ఆయన మాట్లాడుతూ, పెట్టుబడిదారుల పక్షాన నిలబడే మోదీ...ప్రజలను అమాయకులను చేసి ఆడిస్తున్నారని మండిపడ్డారు. గోమాత, గంగా జల శుద్ధి అంటూ ప్రాధాన్యత లేని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సెంటిమెంట్లు రెచ్చగొట్టి పబ్బంగడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ నగరాలుగా కొన్నింటిని తీర్చుదిద్దుతామని చెబుతోందని, వందల కోట్లు కేటాయిస్తామని చెబుతోందని విమర్శించిన ఆయన, ఆ మొత్తంతో గ్రామాలను ఆకర్షణీయ గ్రామాలుగా ఎందుకు చేయదని నిలదీశారు. పట్టణాలకు కేటాయించిన మొత్తంతో కొన్ని వందల గ్రామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దవచ్చని ఆయన సూచించారు. పెట్టుబడిదారులు గ్రామాలపై ఆసక్తి చూపరన్న కారణంతో వాటిని విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని యూపీ మంత్రి అజాం ఖాన్ మళ్లీ విమర్శించారు. ప్రధానికి నిజంగా గోమాతపై గౌరవం ఉంటే ఐదు నక్షత్రాల స్టార్ హోటళ్లలో దానిని నిషేధించాలని సవాలు విసిరారు.