: మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబులాల్ గౌర్ రాజీనామా... బీజేపీలో చర్చ!


మధ్యప్రదేశ్ బీజేపీలో ముసలం పుట్టేలా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. విస్తరణ జరిగిన కొద్దిసేపటికే హోం మంత్రి బాబూలాల్ గౌర్ రాజీనామా చేశారు. దీంతో అక్కడ కలకలం రేగింది. మంత్రివర్గ విస్తరణ నచ్చకే ఆయన రాజీనామా చేశారా? లేక తన వ్యతిరేకులకు మంత్రి పదవులిచ్చారని రాజీనామా చేశారా? అనే చర్చ జరుగుతోంది. ఇది ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందోనని బీజేపీ నేతలు ఆందోళనగా ఉన్నారు. కాగా, ఆయన రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై బీజేపీ అధిష్ఠానం వెంటనే దృష్టి సారించింది. ఇదిలా ఉంచితే, బాబూలాల్ గౌర్‌ రాజీనామా అనంతరం మరో సీనియర్ మంత్రి సర్తాజ్ సింగ్ కూడా రాజీనామా చేశారని, వారిద్దరి రాజీనామాలు గవర్నర్‌కు పంపామని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అయితే వీరి రాజీనామాలు అధిష్ఠానం ఆదేశాల మేరకే జరిగాయని మరో వాదన కూడా వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News