: నేను హీరో అయివుంటే బాగుండేది: దర్శకుడు కోదండరామిరెడ్డి


తాను హీరో అవుదామనుకుని వచ్చి దర్శకుడిని అయ్యానని, తాను హీరో అయివుంటే బాగుండేదని నిన్నటితరం దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, దర్శకుడితో పోలిస్తే హీరోకు చాలా తక్కువ బాధ్యతలు ఉంటాయని, సినిమాకు సంబంధించిన ప్రతి విషయం దర్శకుడే చూసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రాలు సాధించిన విజయాలు, నాటి విశేషాల గురించి చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి దాదాపు అందరూ అగ్రహీరోల చిత్రాలకు తాను దర్శకత్వం వహించానని చెప్పారు.

  • Loading...

More Telugu News