: ఐసీస్ ఉగ్రవాదులకు జూలై 14 వరకు రిమాండ్... కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ రేపటికి వాయిదా


హైదరాబాదులో జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) చేతికి చిక్కిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు నాంపల్లి కోర్టు ఈ నెల 14 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది. ఎన్ఐఏ అధికారులు వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, ప్రభుత్వ న్యాయవాది వారి నేరచరిత్ర, వారు చేయనున్న మారణకాండ గురించి న్యాయస్థానానికి వివరించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం వారికి జూలై 14 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపింది. అలాగే వారిని విచారణకు అప్పగించాలన్న ఎన్ఐఏ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో వారిని కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News