: నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ బిల్లు బకాయిలు ఆరు నెలలుగా నిలిచిపోయానని, బకాయిలు చెల్లించే వరకు ఈ సేవలను ఆపేస్తున్నామని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఈరోజు మీడియాకి తెలిపారు. ప్రభుత్వం రూ.350 కోట్ల మేర బకాయిలను చెల్లించాలని వైద్యులు పేర్కొన్నారు. ఇన్నాళ్లూ బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలనే సేవలు అందించామని వైద్యులు తెలిపారు. బకాయి బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లు బకాయిల వల్ల ఆస్పత్రులు సక్రమంగా నడిపే పరిస్థితి లేదని వారు వ్యాఖ్యానించారు.