: ఇంజనీర్ ను లాగిపెట్టి కొట్టి వివాదానికి ఆజ్యం పోసిన యూపీ మంత్రి అజాంఖాన్
ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ కీలక నేత అజాం ఖాన్ మరో వివాదానికి ఆజ్యం పోశారు. రాంపూర్ లో పర్యటించిన సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు ఆలస్యంగా జరగడానికి కారణమేంటని అడిగారు. ఈ క్రమంలో పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, అక్కడే ఉన్న ఓ ఇంజనీర్ చెంపలు వాయించారు. దీంతో ఆ ఇంజనీర్ నిర్ఘాంతపోగా, ఇతర ఇంజనీర్లు పనులు నిలిపేసి మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో మంత్రిపై విమర్శలు పెరుగుతున్నాయి.