: చైనా విషయంలో మాత్రమే... ఒకే మాటపై ట్రంప్, హిల్లరీ!
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతూ నిత్యమూ ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకుంటున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ లు ఒక విషయంలో మాత్రం ఒకేమాటపై నిలబడుతున్నారు. అదే చైనాతో ద్వైపాక్షిక బంధం. చైనా తన కరెన్సీ విలువను కావాలనే తప్పుగా చూపుతోందని ఇద్దరూ ఆరోపిస్తున్నారు. ఆ దేశంతో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. చైనాతో అమెరికా వాణిజ్య విధానాన్ని ఏడు సూత్రాల ప్రణాళికతో మరింత కఠినం చేస్తామని ట్రంప్ చెప్పగా, ఆపై కాసేపటికే తన ఆలోచనలను ట్రంప్ కాపీ కొట్టడం ప్రారంభించారని, చైనాపై కఠినంగా ఉండాలన్న ఆలోచన తనదేనని హిల్లరీ విరుచుకుపడ్డారు. ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కూడా, ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్న వీరి వైఖరి విస్తుగొలిపేలా ఉందని అమెరికన్లు చర్చించుకుంటున్నారు.