: విజయవాడకు తరలిస్తున్న బీసీ వెల్ఫేర్ ఫైల్స్ లో తెలంగాణ ఫైల్స్ కూడా వున్నాయంటూ అడ్డుకున్న టీ ఉద్యోగులు!


విజయవాడకు తరలిస్తున్న బీసీ వెల్ఫేర్ ఫైల్స్ లో తెలంగాణ ఫైల్స్ కూడా ఉన్నాయంటూ టీ ఉద్యోగులు ఆరోపించారు. ఏపీ ఉద్యోగులు నవ్యాంధ్రకు తరలివెళుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంక్షేమభవన్ ఉద్యోగులు ఈరోజు అమరావతికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో తరలిస్తున్న బీసీ వెల్ఫేర్ ఫైల్స్ ను తరలించకుండా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఏపీ, తెలంగాణ ఫైళ్లు విభజించాలని ఈ సందర్భంగా టీ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News