: లెస్బియన్లు, గేలు ట్రాన్స్ జండర్లు కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు


లింగమార్పిడి కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు మాత్రమే ట్రాన్స్ జండర్లుగా పరిగణించబడతారని సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును ఇచ్చింది. 2014లో ట్రాన్స్ జండర్ పదాన్ని నిర్వచిస్తూ ఇచ్చిన ఆదేశాలను సవరించే సమస్యే లేదని తెలిపింది. లెస్బియన్లు, గేలు, బైసెక్సువల్ వ్యక్తులను ఈ జాబితాలో చేర్చలేమని స్పష్టం చేసింది. పాత తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎన్వీ రమణలు చేపట్టగా, ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మనీందర్ సింగ్ వాదించారు. గతంలో ఇచ్చిన రూలింగ్ లో లెస్బియన్లు, గేలు, బైసెక్సువల్ వ్యక్తులను ట్రాన్స్ జండర్లుగా పరిగణించాలా? వద్దా? అన్న విషయమై స్పష్టత లేదని తెలిపారు. పిటిషన్లపై మరింత విచారణ అనవసరమని, తమ తీర్పు స్పష్టంగానే ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News