: ప్రజల కడుపుకొట్టి, ప్రభుత్వం కళ్లు గప్పి జగన్ ఆస్తులు సంపాదించాడు: బొండా ఉమ
ప్రజల కడుపుకొట్టి, ప్రభుత్వం కళ్లు గప్పి జగన్ ఆస్తులు సంపాదించాడని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు. జగన్ ఇల్లు, కారే కాదు, కూర్చున్న సీటూ ప్రజలదేనన్నారు. ఈడీ చరిత్రలో అత్యధికంగా అటాచ్ చేసింది జగన్ ఆస్తులేనని అన్నారు. ఈడీ అటాచ్ చేసిన జగన్ ఆస్తుల విలువ మార్కెట్ లో రూ.5 వేల కోట్లు అని, సీఐడీ, ఈడీ దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయని అన్నారు. ఏపీ ప్రత్యేక కోర్టుల చట్టం ప్రకారం అటాచ్ చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చని బొండా ఉమా పేర్కొన్నారు.