: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతిని హత్యచేసిన ఆ దుర్మార్గుడు ఇతడే... పోలీసులు విడుదల చేసిన ఫోటో!


చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో దారుణ హత్యకు గురైన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో నిందితుడి హై రెజల్యూషన్ చిత్రాన్ని చెన్నై పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ని హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన పోలీసులు వాటి ఆధారంగా ముఖం క్లియర్ గా కనిపించే ఫోటోను తయారు చేయగా దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఈ కేసులో మద్రాసు హైకోర్టు కల్పించుకుని రెండు రోజుల్లో నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆదేశించినప్పటికీ, పోలీసులు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ ఫోటోను గుర్తించిన వారు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

  • Loading...

More Telugu News