: ఆస్తులు అటాచ్ అయినంత మాత్రాన స్వాధీనం చేసుకున్నట్లు కాదు: వాసిరెడ్డి పద్మ
జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసినంత మాత్రాన స్వాధీనం చేసుకున్నట్లు కాదనే విషయాన్ని టీడీపీ తెలుసుకోవాలని వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ఓదార్పుయాత్రతో అసాధారణ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారని, దీనిని చూసి ఓర్వలేని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆయన ఆస్తులపై తప్పుడు పిటిషన్ లు వేస్తున్నారని అన్నారు. విచారణ ఇంకా జరుగుతోందని, జగన్ ఆస్తులు ఆయనకే తిరిగి వస్తాయనే ధీమాను ఆమె వ్యక్తం చేసింది. జగన్ ఆస్తుల ఈడీ అటాచ్ ను ఆధారంగా చేసుకుని టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. వైఎస్సార్సీపీ మూతపడిపోతుందంటూ టీడీపీ ప్రచారం చేస్తోందని, అదెప్పటికీ జరగదని వాసిరెడ్డి పద్మ అన్నారు.