: హైకోర్టు విభజన కేంద్రం పరిధిలోని అంశం: కేఈ
హైకోర్టు విభజనపై తెలంగాణలో ఆందోళనలు ఉద్రిక్తమవుతోన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిధిలోది అని అన్నారు. తాము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి స్థలం కూడా చూపించినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి హైకోర్టు నిర్మాణానికి నిధులు రావాలని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వంపై విమర్శలు సరికావని ఆయన అన్నారు. కేంద్రం పరిధిలో ఉన్న అంశాన్ని గురించి తమపై విమర్శలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.