: కుమార్తెలను ఈతకు పంపించని తండ్రికి రూ. 3 లక్షల జరిమానా!
తన కుమార్తెలను ఈత నేర్చుకునేందుకు అంగీకరించని ఓ తండ్రికి స్విస్ న్యాయస్థానం రూ. 3 లక్షల జరిమానా విధించింది. బోస్నియా నుంచి వలస వచ్చి 1990 నుంచి స్విట్జర్లాండులో ఉంటున్న ఓ వ్యక్తి స్థానిక చట్టాలకు అనుగుణంగా నడచుకోవడం లేదని ప్రాసిక్యూషన్ వాదించింది. పాఠశాలలో నిర్వహించే పలు క్యాంపులకు బిడ్డలను పంపడని, మహిళలు ఈతలు కొట్టడం ముస్లిం మత విశ్వాసాలకు వ్యతిరేకమని చెప్పాడని న్యాయమూర్తికి తెలిపారు. దీంతో అతనికీ జరిమానా పడింది. కాగా, బురఖాలు ధరించనిస్తేనే తన బిడ్డలను స్కూలుకు పంపుతానని వాదించిన ఇతనికి గత సంవత్సరం కింది కోర్టు ఏడాది జైలు శిక్ష విధించగా, మత స్వేచ్ఛ ఉండాలి కాబట్టి, బురఖా ధరించేందుకు అనుమతించాలని చెబుతూ స్విస్ సుప్రీంకోర్టు ఆ శిక్షను రద్దు చేసింది.