: ఆలయాలను కూల్చొద్దు.. విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
అభివృద్ధి పేరుతో పురాతన ఆలయాలను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో నిర్వహిస్తోన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆలయాల కూల్చివేతకు నిరసనగా ఈరోజు విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. సీపీఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది విస్తరణా..? విధ్వంసమా..? అంటూ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్పోరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు.