: బ్రతికుండగానే మృణాల్ సేన్ ను చంపేసిన మీడియా!... ఆగ్రహం వ్యక్తం చేసిన సేన్ కుటుంబం
మీడియా అత్యుత్సాహం నానాటికీ మితి మీరిపోతోంది. నిన్నటికి నిన్న టాలీవుడ్ నటుడు వేణు మాధవ్ ను బ్రతికుండగానే తెలుగు మీడియా చంపేయగా, తాజాగా భారత చలన చిత్ర దిగ్గజం మృణాల్ సేన్ ను జాతీయ మీడియా చంపేసింది. 93 ఏళ్ల వయసులోనూ నిక్షేపంలా ఉన్న ఆయన చనిపోయారంటూ నేటి ఉదయం పలు మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి. భారత చలన చిత్ర రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖుల్లో ఒకరుగా నిలిచిన సేన్... పలు హిట్ చిత్రాలను రూపొందించారు. నేటి ఉదయం సేన్ చనిపోయారంటూ పలు మీడియా సంస్థల్లో వార్తలు చూసిన ఆయన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. అదే సమయంలో సదరు వార్తలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సేన్ చనిపోయారన్న వార్తలు పచ్చి అబద్దం. 93 ఏళ్ల వయసులోనూ నిక్షేపంగా ఉన్న ఆయన ప్రస్తుతం తేనీరు సేవిస్తున్నారు’ అంటూ ఆయన కుటుంబ సభ్యులు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు తెలిపారు.