: రంగారెడ్డి జిల్లా కోర్టు ఉద్యోగులు నలుగురు సస్పెన్షన్
న్యాయ విభాగంలో నలుగురు ఉద్యోగులు ఈరోజు సస్పెన్షన్‌కు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సహా కార్యదర్శి వెంకట రంగారెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా, సస్పెన్షన్ లకు భయపడేది లేదని, హైకోర్టు విభజనపై తమ ఆందోళనను కొనసాగిస్తామని ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది.