: ఇండియాకు ఎన్ఎస్జీ సభ్యత్వాన్ని అడ్డుకోవడంలో విఫలం... పరోక్షంగా అంగీకరించిన చైనా!


అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మొన్నటి సియోల్ సమావేశాల్లో ఇండియాను తాత్కాలికంగా మాత్రమే నిలువరించగలిగామని చైనా పరోక్షంగా అంగీకరించింది. ఇండియా ఎన్ఎస్జీలోకి రాకుండా అడ్డుకునేందుకు పలు దేశాలతో చర్చించే బాధ్యతలను అప్పగించిన అధికారిని పదవికి దూరం చేసింది. చైనా వాదనకు సరైన మద్దతును కూడగట్టడంలో సదరు అధికారి విఫలమయ్యాడన్నది చైనా నేతల అభిప్రాయం. మొత్తం 48 దేశాలు సభ్యులుగా ఉన్న కూటమిలో ఇండియాకు వ్యతిరేకంగా కనీసం మూడోవంతు దేశాలతో వ్యతిరేకంగా మాట్లాడించాలని చూసిన చైనా, కేవలం నాలుగు దేశాల నుంచి మాత్రమే మద్దతును కూడగట్టుకోగలిగింది. ఇక అమెరికా సైతం భారత్ ను వెనకేసుకొస్తున్న వేళ, ఉన్నతాధికారిని విధుల నుంచి తొలగించడం ద్వారా, ఎన్ఎస్జీలోకి భారత్ రాకుండా చూడటంలో తాము ఓడినట్టు చైనా అంగీకరించినట్టేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News