: పెనమలూరు ఎమ్మెల్యే ఎడ్లబండ్ల ప్రదర్శనలో అపశ్రుతి.. బోడె ప్రసాద్‌కు గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, అనంతపురం జిల్లాల్లో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ నేతలు ఎడ్లబండ్ల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఎడ్లబండ్ల ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్లబండ్లపై కార్యకర్తలతో ప్రదర్శన నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఎడ్లబండి తిరగబడింది. దీంతో బోడె ప్రసాద్‌తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే ఎమ్మెల్యేను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.